సహ చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం

నల్లగొండ జిల్లా:సమాచార హక్కు చట్టం( Right to Information Act ) సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం వ్యవస్థాపక అధ్యక్షుడు యారమాద కృష్ణారెడ్డి అన్నారు.

ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency) పరిధిలోని అనుముల మండలం హాలియాలోని రిటైర్డ్ ఉద్యోగుల సమావేశ మందిరంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన ఆయన కల్పించారు.

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం కోసం ఆర్‌టీఐ ఎంతో దోహదపడుతోందని అన్నారు.ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30రోజుల్లోపు అందించాలని,అలా ఇవ్వని అంశాలపై ప్రజలు, పౌర సమాచార అధికారులతో నల్గొండలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అప్పీలేట్‌ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సమాచారం చెప్పడం,ఆ సమాచారం కలిగివున్న వారి బాధ్యతని,ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని,ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉందని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు.

ప్రభుత్వ పాలన సవ్యంగా ఉండాలన్నా,అవినీతిని అరికట్టాలన్నా,సత్యం కోసం, స్వేచ్ఛకోసం, నీతికోసం,ప్రజా శ్రేయస్సు కోసం,సంక్షేమ అభివృద్ధి ఫలాల కోసం సమాచార హక్కు చట్టం సహ చట్టం అన్ని శాఖల పనితీరును ప్రశ్నించిందని,ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు సకాలంలో ప్రజలకు తెలియచెప్పిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అమలు కావడానికి సమాచార హక్కు చట్టం వారధిగా నిలుస్తున్నదని తెలిపారు.తెలంగాణ సమాచార కమిషన్ చేస్తున్న కృషి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని,ఈ చట్టం ప్రకారం సమాచారం అడిగి తెలుసుకోవడం చాలా సులభమన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రల స్థాయి ముఖ్య సలహాదారులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు హేమలత,జిల్లా అధ్యక్షుడు బైరు సైదులు, నియోజకవర్గ అధ్యక్షుడు ప్రకాష్,అబ్రార్,అనారుద్దీన్, మూల శేఖర్ రెడ్డి,ఇబ్రహీం, శ్రీనివాస్,బాలక్రిష్ణ,శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో : పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?
Advertisement

Latest Nalgonda News