ఇవాళ మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు (శనివారం) మరోసారి ఢిల్లీకి వెళ్లి రాత్రి పార్టీ పెద్దలతో సమావేశమవుతారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 10 వ,తేదీ నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో అక్కడే నలుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఈ పర్యటనలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

CM Revanth Reddy To Visit Delhi Again Today, CM Revanth Reddy , Delhi , Cm Revan

Latest Nalgonda News