మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) శృతిహాసన్( Shruthi Hassan ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) డైరెక్టర్ బాబి( Bobby ) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా 200 రోజులను పూర్తి చేసుకోవడంతో చిత్ర బృందం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వాల్తేరు వీరయ్య చిత్రబృందం పాల్గొన్నారు.
అలాగే మాస్ మహారాజ రవితేజ( Raviteja ) కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ మధ్యకాలంలో వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ను భారీగా టార్గెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా చిరంజీవి తన తమ్ముడి పట్ల వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నటువంటి మెగాస్టార్ సమయం దొరికినప్పుడు వైసీపీ ప్రభుత్వం పై సెటైర్స్ వేస్తూ ఉంటారు.అయితే తాజాగా బ్రో విషయంలో అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మీలాంటి గొప్ప వాళ్ళు, పెద్దవాళ్లు ప్రత్యేక హోదా గురించి రోడ్ల నిర్మాణం గురించి ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే మేమంతా తలవంచి మీకు నమస్కారం చేస్తాము.అలా కాదని అభివృద్ధిని గాలికి వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి.దీనిని ఓ పెద్ద సమస్యల చూపించకండి అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.