ఆమె మనసు మార్చు స్వామీ

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓగా విధులు నిర్వహిస్తున్న గీతకు కనువిప్పు కలిగేలా చూడమని గుట్టపై పూజలు చేసిన జర్నలిస్టులు,దేవునికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఆలయ ఈఓ గీత ఏకపక్ష నిర్ణయాలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఎవరు చెప్పినా చెవిన పెట్టకుండా మొండిగా వ్యవరిస్తున్నారని అన్నారు.

గుట్టపైకి ఎవరూ రాకుండా ఇష్టానుసారంగా ఆంక్షలు విధిస్తూ,చివరికి కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులను కూడా రాకుండా పోలీసులతో అడ్డుకోవడం బాధాకరమని అన్నారు.అధికారులు కూడా ఆమెపై చర్యలు తీసుకునేలా లేరని,అందుకే ఆ దేవుడే ఆమె మనసు మార్చాలని కోరుతూ పూజలు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Nalgonda News