సాధారణంగా పెంపుడు జంతువులను( Pets ) ప్రయాణాలలో తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది.అందులోనూ పిల్లులను కాలేజీకి తీసుకెళ్లడం అంటే కొంచెం ఇబ్బంది.
అయితే తన యజమానితో పాటు కాలేజీకి వెళ్లడం మొదలు పెట్టిన ఓ పిల్లి( Cat ) ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.అది క్రమం తప్పకుండా వెళ్తూ బెస్ట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.నారింజ రంగులో ఉండే ఆ పిల్లి నిత్యం క్లాస్ రూమ్‌కి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
రోజూ క్లాస్ రూమ్‌కి వెళ్లే ఆ పిల్లి పేరు మైక్.క్రమం తప్పకుండా క్లాస్‌లకు హాజరవుతూ వస్తుండడంతో దానికి ప్రత్యేక ఆకర్షణ వస్తోంది.
వాస్తవానికి, మైక్ అనే ఈ పిల్లి గత 4 ఏళ్లుగా ఆ కాలేజీలో చదువుతోంది.పైగా ఆ పిల్లికి క్లాస్ రూమ్( Cat Studying in College )లో పర్మినెంట్‌గా ఓ సీటు కూడా ఉంటుంది.క్లాస్ కి వచ్చినప్పుడల్లా అక్కడే అది కూర్చుంటుంది.దానికి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు.కాబట్టి విన్నంత సేపు క్లాస్ వింటుంది.లేని పక్షంలో చక్కగా తన సీట్‌లో నిద్రపోతుంది.
క్లాస్ అయిపోయిన తర్వాత టీచర్ దానిని లేపుతుంది.ఆ తర్వాత ఏదో ఆదమరిచినట్లు త్వరత్వరగా కంప్యూటర్ క్లాసుకు వెళ్తుంది.
అక్కడ కంప్యూటర్ చెబుతున్న కోడింగ్ క్లాసును చాలా శ్రద్ధగా వింటుంది.ఇలా ఈ పిల్లికి కాలేజీలో చాలా మంచి పేరు ఉంది.
క్రమం తప్పకుండా కాలేజీకి వచ్చే ఆ పిల్లి అంటే టీచర్లకు కూడా చాలా ఇష్టం.
అది ఇతర స్టూడెంట్స్‌తో కలిసి లిఫ్ట్ ఎక్కుతుంది.తర్వాత లంచ్ టైమ్‌కు ఓ అమ్మాయి దానికి భోజనం తీసుకొస్తుంది.తిన్న తర్వాత తిరిగి అది క్లాస్ రూమ్‌కి వెళ్తుంది.
ఇలా దానిని క్లాస్ స్టూడెంట్స్ అందరిలో బెస్ట్ స్టూడెంట్‌గా టీచర్లు చెబుతుంటారు.ఈ పిల్లికి చాలా చరిత్ర ఉంది.
అది కొన్నేళ్ల క్రితం ఓ స్టూడెంట్‌తో కలిసి రోజూ వచ్చేదని టీచర్లు పేర్కొన్నారు.తర్వాత ఆ స్టూడెంట్ కాలేజీ పూర్తయినా ఆ పిల్లి మాత్రం కంటిన్యూగా కాలేజికి రావడం ప్రారంభించినట్లు టీచర్లు వివరించారు.
దీంతో దీనిని అక్కడి టీచర్లు చాలా ఇష్టంగా చూసుకోవడం మొదలు పెట్టారు.ఏకంగా దానికి హాస్టల్ కూడా కేటాయించారు.