తెలంగాణ ఆకాంక్షను సాకారం అవ్వడానికి నిజానికి అనేక కారణాలు ఉన్నాయి.ముఖ్యంగా తెలంగాణ సమాజం పూర్తిస్థాయిలో తమ ఆత్మ గౌరవ నినాదంగా ఎత్తుకొని సకలజనుల సమ్మె లాంటి తీవ్ర స్థాయి ఉద్యమాలు చేయడం తో పాటు అనేకమంది యువత ప్రాణ త్యాగాలు కూడా చేయ్యడం తో ఈ దీర్ఘ కాల ఉద్యమం పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర రాజకీయ పార్టీలు నెట్టబడడం తో తెలంగాణ కల సాకారం అయిందని చెప్పవచ్చు.
అయితే రాజకీయంగా కేంద్ర పార్టీలపై ఒత్తిడి తీసుకురావడంలోనూ రాష్ట్రంలో ఆ రాజకీయ వేడిని సజీవంగా దీర్ఘ కాలం పాటు నిలబెట్టి ఉంచడంలోనూ అప్పటి టిఆర్ఎస్ కూడా అత్యంత కీలక పాత్ర పోషించింది.దాంతో తెలంగాణ వచ్చిన తర్వాత అందరికంటే ఎక్కువ రాజకీయ ప్రయోజనం కూడా ఆ పార్టీకే కలిగింది.
తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటికి రెండుసార్లు గద్దె నెక్కి పరిపాలించగలిగిందంటే తెలంగాణ ఓటర్లు తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్( CM KCR ) ని గుర్తించి గౌరవించి నట్లే భావించాలి.
అయితే పరిపాలనా పరంగా తెలంగాణలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు.మౌలిక సదుపాయాల పరం గాను పారిశ్రామిక అభివృద్ది లోనూ బారస ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ది నే సాదించింది .ముఖ్యంగా హైదరాబాదు లాంటి మెగాసిటీ చేతిలో ఉండడంతో ఆదాయానికి పెద్దగా ఇబ్బందులు లేకపోవడంతో అనేక కీలకమైన సాగునీటీ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించగలిగింది.తద్వారా వ్యవసాయ రంగం( Agriculture sector )లో గణనీయమైన అభివృద్ది సాదించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలోనూ తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశంలో ముందుకు రాగలిగింది.దీనిలో కేసీఆర్ కృషిని తక్కువ చేయకపోయినా ఆర్థికంగా వెసులుబాటు ఉండటం కూడా కలిసి వచ్చింది అనే చెప్పాలి .
అయితే ఈ దశాబ్ద కాలం పరిపాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి కూడా తారాస్థాయికి చేరిందని విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా భూ కబ్జాలు , సెటిల్మెంట్లు లలో మంత్రులు, ఎమ్మెల్యేల బంధువుల అరాచకాలు చాలా మీడియాలో చర్చనీయాంశంగా మారాయి .రాజకీయ ప్రయోజనం కోసం ఆయా నేతలపై బారాస కేంద్ర నాయకత్వం కూడా సరైన చర్యలు తీసుకోక పోవడం , పైగా సిట్టింగ్ లలో 90 శాతానికి పైగా మళ్ళీ టికెట్ లో ఇవ్వడం తో ఇప్పుడు ఆ ప్రతిస్పందన ఎన్నికల్లో కనిపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.ఒక వ్యవసాయ రంగం పై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ తో తెలంగాణ వ్యవసాయ రంగ ఆదాయం కూడా బాగా పెరిగింది దాంతో కొన్ని వర్గాలలో కేసీఆర్ పట్ల కృతజ్ఞత కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా సమాజంలో రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను చేరదీయలేకపోవడం ,యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లో విఫలం కావడం వంటివి బారతీయ రాష్ట్ర సమితి కి ప్రతిబంధాలు గా మారాయి.
పైగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్( TSPSC Group 1 ) లో లీకేజీలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాయ్ .ఇలా కొన్ని ప్లస్లు మైనస్లతో ఎన్నికలకు సిద్ధమైన బారాస ఈసారి కేసీఆర్ ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుంది అన్నదానిపైనే ఆ పార్టీ విజయవకాశాలు ఆదారపడి ఉన్నాయని చెప్పవచ్చు.ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయి.కేసీఆర్ని మళ్లీ గెలిపించాలని వాళ్ళు ఒక వర్గం కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలన్న వాళ్ళు ఒక వర్గంగా మారిపోయీ పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది .మరి కెసిఆర్ తన మ్యాజిక్ ను మరోసారి నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.