మార్చి నెల దాటక ముందే మండుతున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా:మార్చి నెల దాటకముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి.

ఒకపక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరోపక్క వడగాల్పులతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి.

భానుడి భగభగలతో జిల్లా ప్రజలు విలవిలలాడిపోతున్నారు.సెగలు చిమ్ముతూ అసాధారణ రీతిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉమ్మడి జిల్లా ఉడుకెత్తి పోయింది.

Heavy Heat Waves In Nalgonda District, Heavy Heat Waves , Heavy Heat , Departm

రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.శుక్రవారం నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ ( Department of Meteorology )హెచ్చరికలు జారీ చేసింది.

ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement
సర్టిఫికెట్లు ఎన్నిసార్లైనా మీ సేవలో తీసుకోవచ్చు...!

Latest Nalgonda News