ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ మరో సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.
అయితే ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ( Congress Party ) బన్నీ ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.వైరల్ అవుతున్న వీడియోలను చూసి షాకవ్వడం బన్నీ ఫ్యాన్స్ వంతవుతోంది.
అయితే వైరల్ అవుతున్న వీడియో బన్నీ డీప్ ఫేక్ వీడియో కావడం గమనార్హం.కొంతమంది కావాలని బన్నీని టార్గెట్ చేసి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయాల్సి వచ్చినా జనసేన పార్టీకి( Janasena Party ) చేస్తారు తప్ప మరో రాజకీయ పార్టీకి ప్రచారం చేయాల్సిన అవసరం అయితే లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
దేశంలో కాంగ్రెస్ ను గెలిపించాలంటూ అల్లు అర్జున్ పేరుతో వైరల్ అవుతున్న వీడియోలలో ఏ మాత్రం నిజం లేదు.డీప్ ఫేక్ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలకు ఊహించని స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసిన వాళ్ల కోసం కఠిన శిక్షలను అమలు చేస్తున్నా ఈ పరిస్థితులు మాత్రం మారడం లేదనే చెప్పాలి.
అల్లు అర్జున్ సైతం ఫేక్ వీడియోల( Fake Video ) విషయంలో వెంటనే క్లారిటీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మరోవైపు యాడ్స్ లో కూడా అదే సంఖ్యలో నటిస్తున్నారు.బన్నీ ఆస్తుల విలువ భారీ స్థాయిలో ఉందని తన సంపాదనను బన్నీ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.