గరికపాటిపై కేసు పెట్టిన బీఎస్పీ నేతలు

నల్లగొండ జిల్లా:బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు అవినీతి అక్రమాలు చేశారంటూ తన ఆధ్యాత్మిక ప్రవచనంలో రాజకీయ ఆరోపణలు చేస్తూ,మాయావతిపై స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు.

శుక్రవారం నకిరేకల్,కేతేపల్లి పోలీస్ స్టేషన్ల లో గరికపాటి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రవచనాలు చెప్పుకుంటూ బతుకును కొనసాగించే గరికపాటి మహిళలను కించపరిచేలా,హేళన చేసేలా మాట్లాడడం,మహిళలను అవమానించడం సరైనది కాదన్నారు.నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు,రేపిస్టులకు గరికపాటి వ్యాఖ్యలు ప్రేరేపితంగా ఉన్నాయని మండిపడ్డారు.

ఆడవారు వేసుకునే దుస్తులపై కామెంట్స్ చేస్తున్న గరికపాటి ముందు తన ఆలోచనా విధానాన్ని,తన మనసులో దాగున్న వికృత ఆలోచనలు మార్చుకోవాలని సూచించారు.అట్టడుగు స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతితో పాటు,మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవరకొండ యువతి గిన్నిస్‌ బుక్‌ రికార్డు
Advertisement

Latest Nalgonda News