ఫేక్ కేసులు, చీప్ లీకులు తప్ప కాంగ్రెస్ వాళ్లకు పాలన చేతకాదు

నల్లగొండ జిల్లా: ఫేక్ కేసులు,చీప్ లీకులు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని,పొలాలు ఎండిపోతుంటే ఎవ్వడూ పట్టించుకోవడం లేదని, పాలన చేతకాక పనికిమాలిన మాటలు మాట్లడుతుండ్రని,దానికి కేసీఆర్ వ్యతిరేక మీడియా విషం చిమ్ముతున్నదని, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ సర్కార్ పై ఫైరయ్యారు.

ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా పోలీసులను ఏనాడు వాడుకోలేదని,అక్రమ కేసులు పెట్టలేదని గుర్తు చేశారు.

సమైక్య పాలనలో తెలంగాణ ఉద్యమ సమయంలో నా ఫోన్, ఇతర నాయకుల ఫోన్లు కూడా లగడపాటి రాజగోపాల్ ట్యాప్ చేశారని,వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వమంటే చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు, ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలు లిస్ట్ ప్రభుత్వానికిస్తే పట్టించుకోలేదని ఆరోపించారు.

Brs Mla Jagadish Reddy Fires On Congress Govt, Brs, Mla Jagadish Reddy , Congres

రేవంత్ గాడు కేసీఆర్ లాగు ఊడ బీకుతా అంటుండు,లాగు విప్పి ఏం చూస్తాడని ఎద్దేవా చేశారు.దీనికా మీకు అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు.

ఇక జిల్లా పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతున్నాడని.తమ్ముడికి మంత్రి పదవి వచ్చి,తనది ఎక్కడ పోతుందోనని బెంగ పెట్టుకుని రేవంత్ చెప్పులు తుడుస్తున్నాడని అన్నారు.

Advertisement

మేము అధికారంలో వున్నప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్ లో కూడా నీళ్లు ఇచ్చినమని, ఇప్పుడు సాగర్ లో నీళ్లు వున్నా ఇవ్వలేని రండలు, చేతకాని వేదవలు కాంగ్రెస్ వాళ్లని మరోసారి కాంగ్రెస్ నేతలపై ఘాటుగా విరుచుకుపడ్డారు.గ్రామాల్లో చైతన్యం రావాలని, ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ ఇచ్చిన మాయ హామీలపై ఎక్కడికక్కడ నిలదియాలని సూచించారు.

కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని,గులాబీ జెండా వేసుకున్న యోధులు మన కార్యకర్తలని,ఏ మాత్రం పొరపాటు చేసినా ఆగమవుతామని,ఇప్పటికే తెలంగాణ సర్వనాశనం అయిందని,కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

Latest Nalgonda News