BRS MLA : కమలం ఆకర్ష్ కు ఆకర్షితుడైన ఓ గులాబీ మాజీ ఎమ్మెల్యే…?

ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgoonda )కు చెందిన ఓ గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చూపు కమలంపై పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో బీఆర్ఎస్( BRS ) అధికారం కోల్పోవడం,కాంగ్రెస్ మరింత బలపడడంతో ఇక బీఆర్ఎస్ తో లాభం లేదని భావించిన సదరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్( BJP Operation Akarsh ) లో పడ్డట్లు అత్యంత సన్నిహితుల నుండి టాక్ వినిపిస్తుంది.

నల్లగొండ లోక్ సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా సరైన నాయకుడు కనిపించని కారణంగా కాషాయ తీర్థం పుచ్చుకుని ఎంపీగా రంగంలో దిగితే కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డీలాపడుతున్న తరుణంలో ఆ పార్టీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్( Congress ) లోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో తీవ్ర విబేధాలు ఉన్నవారు బీజేపీ వైపు వెళుతున్న విషయం తెలిసిందే.

BRS MLA : కమలం ఆకర్ష్ కు ఆకర్షితుడై�

ఇదే అదునుగా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో ఆ మాజీ ఎమ్మెల్యే అటువైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.ఇదే నిజమైతే ఇక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News