బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు.గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
స్కాట్లాండ్ లోని బాల్ మోరల్ ప్యాలెస్ లో మరణించినట్లు ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి.రాణి భౌతికకాయాన్ని బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నట్లు తెలిపాయి.
70 సంవత్సరాల దీర్ఘ కాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు.1922లో జన్మించిన ఆమె ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్ను 1947లో వివాహం చేసుకున్నారు.22 ఏళ్ల వయస్సులోనే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగారు.