ఎవరు ఏమైనా అనుకోండి ఒక హీరో 100 మందిని ఒకేసారి నరికిన, వాడు ఇంకే ఏ దరిద్రపు పని చేసినా ఎలా ఉన్నా సరే బోయపాటి( Boyapati Srinu ) చిత్రాల్లో హీరోయిన్ తప్ప సినిమాలోని మిగతా ఆడవాళ్ళంతా కూడా చాలా చక్కగా నిండుగా నగలతో ఉంటారు.సాధారణంగా ప్రతి సినిమాలో హీరోయిన్స్ ఒళ్ళంతా బంగారం వేసుకొని కనబడాలని రూల్ ఏమీ లేదు.
సగటు పాత్రలు ఆడవారిని ఎంత రిచ్ గా డిజైన్ చేసిన మోస్తరుగా రెడీ అయితే సరిపోతుంది.కానీ మన బోయపాటికి మాత్రం ఒక మంచి ఫ్యాన్సీ ఉంటుందో ఏమో తెలియదు కానీ హీరోయిన్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ నిండుగా బట్టలు నగలు ఉండేలా చూసుకుంటాడు పైగా ఒక్క సినిమాకి ఎందుకు ఉంటారో తెలియదు కానీ డజన్ల కొద్ది ఆడవాళ్లు ఉంటూ ఉంటారు.
ఉదాహరణకు సింహా సినిమా( Simha ) తీసుకోండి డాక్టర్ గా బాలకృష్ణ బయట వందల మందిని నరుకు నరుకుతాడు, హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తాడు.కానీ ఇంటికి వచ్చేసరికి నయనతార ఒళ్ళంతా కేజీల చొప్పున బంగారం దిగేసుకొని పట్టుచీర కట్టుకొని పప్పు చారు మరగబెడుతూ ఉంటుంది.అదే సినిమాలో పూజారి కూతురు పద్ధతిగా బాలకృష్ణ కాళ్ళు మొక్కుతూ కనిపిస్తుంది. దమ్ము( Dammu ) చిత్రంలో కూడా తారక్ చాలా మందితో గొడవలు పడుతూ నరుకుతూ వెళతాడు కానీ ఆడవారు మాత్రం యజ్ఞాలు, యాగాలు చేస్తూ చాలా చక్కగా ఉంటారు.
లెజెండ్ సినిమాలో బాలకృష్ణ( Balakrishna ) స్ర్తీ గురించి చాలా అద్భుతంగా వేపు చింతపండు చేసి మరి ఈ విలన్ గ్యాంగ్ కి వివరణ ఇస్తాడు.
ఇక వినయ విధేయ రామ సినిమా( Vinaya Vidheya Rama ) తీసుకోండి ఇంట్లో ఎందుకుంటారో తెలియదు చాలామంది ఫేడ్ ఔట్ నటీమణులను తీసుకొచ్చి పెట్టి కలర్ ఫుల్ గా స్క్రీన్ ని డిజైన్ చేసుకున్నాడు.ఇలా బోయపాటి సినిమాల్లో నటీమణులు అంతా కూడా చక్కగా బోలెడన్ని గిల్టు నగలో లేక బంగారపు నగలో తెలియదు కానీ అవి ధరించాల్సి వస్తుంది.రుక్మిణి శ్రీకృష్ణుని కోసం ఎంత బంగారాన్ని తచించిందో తెలియదు గానీ బోయపాటి మాత్రం అంతకన్నా ఎక్కువే టాలీవుడ్ సినిమా పరిశ్రమ కోసం చేస్తున్నాడు.