సినిమా అంటేనే మంచి అతి పెద్ద మార్కెట్ ఉన్న బిజినెస్.చిన్న మొత్తాల్లో డబ్బు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కొంత మంది నిర్మాతలు.
ఇక ఇలాంటి సినిమా మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ లో హీరోలకు మంచి పారితోషకం లభిస్తుంది.ఒక ఏరియా కు పరిమితం అయినా హీరోలను మినహాయిస్తే దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హీరోలకు అయితే చాల పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుతుంది.
ఆలా బాలీవుడ్ లేదా ప్యాన్ ఇండియా హీరోలకు అలాగే తెలుగు ఇండస్ట్రీ కి చెందిన వారికి అందుతున్న పారితోషకం ఎంత.? ఎవరు ఎక్కువ మొత్తం లో తీసుకుంటున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రభాస్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా అందరికన్నా కూడా ఎక్కువ మొత్తంలో పారితోషకం అందుకుంటుంది ప్రభాస్( Prabhas ) మాత్రమే.ఇతడు ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడు.దీనితో పాటు సినిమా విజయం సాధిస్తే లాభాల్లో వాటా కూడా అందుతుంది.
అక్షయ్ కుమార్
రామసేతు చిత్రం విజయం సాధించడం తో అక్షయ్ కుమార్( Akshay Kumar ) చాల రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు అక్షయ్ కుమార్.తన తదుపరి సినిమా కట్ ఫుట్లీ కోసం 120 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
రామ్ చరణ్
మెగా స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రం కోసం 100 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడు.దీనితో అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో ఒకడిగా నిలిచాడు.
విజయ్
తమిళుడు లో దళపతి అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్ వారసుడు సినిమ విజయం సాధించాక ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు.
షారుక్ ఖాన్
అత్యధిక ఆస్తులు కలిగిన ఇండియన్ సినిమా నటుల్లో ఒక్కరైనా షారుక్ ఖాన్ పఠాన్ సినిమా విజయ సాధించాక జవాన్ చిత్రం తో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.షారుక్ ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల వరకు అందుకున్నాడు.
మహేష్ బాబు
తెలుగు లో మంచి హీరో గా గుర్తింపు పొందిన హీరో మహేష్ బాబు వరస హిట్లతో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు.అంతే కాదు ఒక్క ఫ్యాన్ ఇండియా సినిమా తీయకపోయిన బాలీవుడ్ హీరోలతో పాటు 80 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు.
సల్మాన్ ఖాన్
చాల ఏళ్లుగా ఇండస్ట్రీ ని ఏలుతున్న కండల వీరుడు సల్మాన్ సైతం ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్
ఒక వైపు రాజకీయం మరో వైపు గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్న పవన్ ఒక్కో సినిమా కోసం 60 కోట్లు పుచ్చుకుంటున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఫ్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న కూడా తీసుకుంటుంది కేవలం 55 కోట్లు మాత్రమే.
అల్లు అర్జున్
పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ రెండు భాగాల కోసం 70 కోట్లు అందుకోగా తదుపరి సినిమాల 70 నుంచి 80 కోట్లు డిమాండ్ చేయాలనీ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.