ముకేశ్ అంబానీ( Mukesh Ambani ) ఇంట్లో జరిగే పెళ్లి సందడి సెగ టాలీవుడ్ కి తాకింది.ఇప్పటి వరకు తెలుగు వారిపై ఉన్న అక్కసు మొత్తం కొట్టచ్చినట్టు ఈ పెళ్లి వేడుకలో తెలిసిపోతున్నాయి.
ముఖ్యంగా అంబానీ ఇంటి ఆహ్వానం కేవలం రామ్ చరణ్ కి( Ram Charan ) మాత్రమే దక్కింది.రామ్ చరణ్ కూడా సతి సమేతంగా ఈ వేడుకకు హాజరు అయ్యాడు.
కానీ బాలీవుడ్( Bollywood ) వారి ఆధిక్యం ఉన్న ఈ వేడుకలో రామ్ చరణ్ ని స్టేజ్ పైకి పిలిచే క్రమం లో ఇడ్లి, వడ అంటూ ఎదో చీప్ గా అవమానించే ప్రయత్నం చేసాడు షారుక్ ఖాన్.( Shahrukh Khan )
ఈ మాటలతో హర్ట్ అయినా ఉపాసన( Upasana ) వేడుక నుంచి ఉన్న పళంగా బయటకు వచ్చేసింది.ఆ విషయాన్నీ కూడా ఆ తర్వాత బాహాటంగా చెప్పింది.అయితే ఈ సంఘటన తో బాలీవుడ్ లో అందరు నార్మల్ గానే ఉన్నారు కానీ టాలీవుడ్( Tollywood ) మాత్రం హీట్ ఎక్కిపోతుంది.
మొదటి నుంచి మనల్ని అవమానించే పనిలో బాలీవుడ్ ఉంది.అందుకే ప్రపంచం మొత్తం చూస్తున్న అలాంటి ఒక పెళ్లి వేడుకలో రామ్ చరణ్ ని పిలిచి మరి అవమానించి పంపారు.
గతంలో అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి వారు కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు.తెలుగు వారికి మాత్రమే ఈ అవమానాలు ఎందుకు అని సగటు సినీ ప్రేక్షకుడు ప్రశ్నించే పరిస్థితి.
ఇలాగే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే లేదా మన భాషను టార్గెట్ చేస్తే హిందీ వారికి వచ్చే సంతృప్తి ఏమి లేదు కదా.వారికి లేని విజయాలు మనకు దక్కుతున్నాయి అనే అసూయా తప్ప మరొకటి లేదు అని సుస్ప్రష్టం అవుతుంది.ఒక ఖాన్ ని లేదా ఒక కపూర్ హీరోకి ఇలాంటి పరిస్థితి వచ్చి అవమానం జరిగితే ఇండియా మొత్తం ఏకం అయ్యి ట్విట్టర్ ని బద్దలు కొట్టే వాళ్ళు.ఇంస్టా ని చీల్చి చెండాడే వాళ్ళు.
మరి అదే పరిస్థితి ఒక తెలుగు హీరోకు జరిగితే మాత్రం మరో తెలుగు హీరో కూడా పట్టించుకోని పరిస్థితి.అయినా బాలీవుడ్ లో ఒకసారి టార్గెట్ చేయబడితే సుశాంత్ సింగ్ లా( Sushant Singh ) తప్పుకోవడం తప్ప ఏం చేయలేము అనుకుంటున్నారేమో.
ఆ రోజులు ఎప్పుడో పోయాయి.