బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని తాజాగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి నటి పరిణితి చోప్రా ( Parineeti chopra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పరిణితి తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha ) ను ఎంతో ఘనంగా ఉదయపూర్ లీలా ప్యాలెస్ లో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరి వివాహం తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా రాఘవ పరిణితి పెళ్లి ఫోటోలు పై ఎంతోమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టారు.అయితే వీరిద్దరూ కూడా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారని చెప్పాలి.పరిణితి చోప్రా నికర ఆస్తుల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగడమే కాకుండా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమె ఎంత మొత్తంలో ఆస్తులు కూడా పెట్టి ఉంటుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈమె విషయానికి వస్తే సుమారు 60 కోట్ల ( 60 crores approx )వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈమెకు ముంబైలో కూడా కొన్ని ప్లాట్లు ఉన్నాయి అని తెలుస్తుంది.సముద్రపు వ్యూ కనిపించేలా ముంబైలో ఈమె ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారట.ఈ ఫ్లాట్ ఖరీదు ఏకంగా 22 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం అదేవిధంగా ఈమె వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది.ఈ కార్ల విలువ కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటాయని బాలీవుడ్ సమాచారం ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే పరిణితి చోప్రా భారీగానే ఆస్తులు కూడా పెట్టారని చెప్పాలి.