దేశవ్యాప్తంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుంది.
ఈ క్రమంలో పార్టీ పెద్దలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదే సమయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆశించిన రీతిలో స్థానాలు గెలవలేక పోవటం తెలిసిందే.కేవలం 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ( BJP ) గెలవడం జరిగింది.
జనసేన పార్టీ( Janasena party )తో పొత్తు పెట్టుకున్నా గాని ఆ ప్రభావం ఎక్కడ కూడా తెలంగాణలో కనిపించలేదు.
దీంతో ఇప్పుడు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను( Parliament elections ) బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి అమిత్ షా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే.ఈ క్రమంలో పార్టీ నాయకులతో పలు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి 5వ తారీకు నుండి 14వరకు రథయాత్రలు చేయాలని డిసైడ్ అయ్యింది.పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ ఎంపీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుంది.
దీనిలో భాగంగా తొలుత క్లస్టర్ల పరిధిలో రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర నిర్వహించడానికి పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు.ఈ రథయాత్రలో రాష్ట్ర నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ నీ తెలంగాణ బీజేపీ అధిష్టానం విడుదల చేయనున్నట్లు సమాచారం.