పవన్ ఫ్యాక్టర్ ను పక్కన పెట్టిన బిజెపి?

నిన్న మొన్నటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ కు విపరీతమైన గౌరవ మర్యాదలు ఇచ్చిన బిజెపి, తెలంగాణలో జనసేన సాధించిన ఫలితాల పరిశీలన తర్వాత పవన్ ని పక్కన పెట్టినట్టేనా అంటే అవుననే సమాదానం వస్తుంది .ఆంధ్ర ప్రాంతపు పార్టీగా ముద్రపడినా కూడా జనసేనతో దోస్తీకి ధైర్యం చేసిన తెలంగాణ బిజెపి ఫలితాల తర్వాత నిరుత్సాహపడింది .

 Bjp Left The Pawan Factor,telongana Politic,ap Janasena,bjp Alience-TeluguStop.com

తెలంగాణ లో గణనీయమైన స్తాయిలో అభిమానులు ఉన్న పవన్ తి పొత్తు తమకు లాభిస్తుంది అని బిజెపి అంచనా వేసింది .కనీసం ఒక 15 సీట్లు అయినా గెలుచుకుంటే తాము కింగ్ మేకర్ అవ్వొచ్చని బజాపా ఆశపడింది .అయితే పవన్ మద్దతు పార్టీకి ఏ రకంగానూ ఉపయోగపడలేదని ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను సమీక్ష చేసుకున్న బిజెపి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.అందుకే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నామని బిజెపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.

తాము కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు సమాన దూరం పాటిస్తున్నామని ఒంటరిగానే ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తద్వారా తమకు పవన్ తో దోస్తీ లేదని కన్ఫామ్ చేసినట్లయ్యింది .

Telugu Ap Janasena, Bjp Alience, Bjp Pawan-Telugu Political News

నిజానికి అసెంబ్లీ ఎన్నికల లో పవన్ స్టార్ ఇమేజ్ తమ అభ్యర్థులకు ప్రధాన ప్రచారాస్త్రంగా పనిచేస్తుందని బిజెపి ఆశించింది.కారణాలు ఏమిటో తెలియదు కానీ పవన్ తన స్వంత పార్టీ అభ్యర్థుల తరపున కూడా గట్టిగా ప్రచారం చేయకపోవడం బిజెపి కి కోపం తెప్పించిందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఇక ఒంటరిగానే తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి సిద్ధపడిందట.అంతే కాకుండా రాబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పొత్తులను కూడా బజాపా అధిష్టానం నిశితం గా పరిశీలిస్తుంది అని, జనసేన తెలుగుదేశం కూటమి ఇంకా స్టార్టింగ్ ట్రబుల్ స్టేజ్ లోనే ఉండడం వైసిపి కే ఎడ్జ్ ఉన్నట్టుగా సర్వే పలితాలు వస్తూ ఉండడం తో చివరి నిమిషం వరకూ ఎదురచూసి నిర్ణయం తీసుకోవాలని కమలనాధులు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube