ఆమెతో అఖిల్ సార్థక్ ప్రేమాయణం.. చివరికి కుక్క అంటూ!

ఆమెతో అఖిల్ సార్థక్ ప్రేమాయణం.. చివరికి కుక్క అంటూ!

బుల్లితెర రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 4 లో గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు వచ్చారని కామెంట్లు వినిపించాయి.అలా ప్రేక్షకులకు పెద్దగా తెలియని కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ ఒకరు.

 Bigg Boss 4 Akhil Sarthak Shares Toughest Moments In His Life, Bigg Boss 4 Akhil-TeluguStop.com

బిగ్ బాస్ తొలి వారం రోజులు కూడా అఖిల్ పెద్దగా హైలెట్ కాలేదు.అయితే మోనాల్ తో లవ్ ట్రాక్, గంగవ్వతో అనుబంధం అఖిల్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అఖిల్ కు రోజురోజుకు బయట కూడా ఫాలోయింగ్ పెరుగుతుతోంది.

 ఆమెతో అఖిల్ సార్థక్ ప్రేమాయణ-TeluguStop.com

మోనాల్ అఖిల్ జంట చూడముచ్చటగా ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

బిగ్ బాస్ అన్ సీన్ వీడియో ద్వారా అఖిల్ బ్రేకప్ స్టోరీ గురించి, అఖిల్ ఫ్యామిలీ పడిన కష్టాల గురించి ప్రేక్షకులకు తెలిసింది.అఖిల్ బిగ్ బాస్ హౌస్ లో తమ ఫ్యామిలీ గురించి చెబుతూ అమ్మానాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.

వాళ్లు పెళ్లి తరువాత చాలా కష్టాలను అనుభవించారని చెప్పారు.

అమ్మ టైపిస్ట్ గా పని చేసి రోజుకు 300 రూపాయలు సంపాదించేదని.

నాన్న ఆటో నడిపి డబ్బులు సంపాదించేవాడని.మూడు సంవత్సరాల క్రితం తన జీవితంలో దారుణమైన పరిస్థితులు వచ్చాయని.

ఆ సమయంలో పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావని చెప్పుకొచ్చారు.ఒకే సమయంలో తాను ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ జరిగిందని.

నాన్నకు గుండెపోటు వచ్చిందని.కెరీర్ లో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని.

ఒకేసారి కష్టాలు చుట్టుముట్టడంతో తట్టుకోలేకపోయానని తెలిపారు.

అమ్మే నాన్నను చూసుకుంటోందని.

అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన గంగవ్వ అఖిల్ గతంలోనే ఒక హీరోయిన్ ను ప్రేమించాడని.

అఖిల్ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకుందామని అడగగా అతనిని కుక్కతో పోల్చిందని.ఈ కుక్కని ఎన్నిసార్లు వద్దన్నా నన్నే చూస్తుందని హీరోయిన్ అఖిల్ గురించి కామెంట్లు చేసిందని చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube