'జం జం జజ్జనిక' అంటూ సెలెబ్రేషన్ స్టార్ట్ చేసిన చిరు.. భోళా సాంగ్ ఈ రోజే!

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఫుల్ ఫామ్ లో ఉండడంతో అంతే జోష్ తో సినిమాలు చేస్తూ పోతున్నాడు.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ( Bhola Shankar ).

 Bhola Shankar Second Single Update, Bhola Shankar Second Single, #jamjamjajjanak-TeluguStop.com

తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర( Anil Sunkara ) ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి భోళా మేనియా అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.ఇది బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు రెండవ పాటకు సమయం ఆసన్నం అయ్యింది.

కొద్దీ సేపటి క్రితమే సెకండ్ సాంగ్ పై మేకర్స్ అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.సెకండ్ సింగిల్ ఈ రోజు రాబోతుంది అని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ మరోసారి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ సాంగ్ ప్రోమో ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ చిరు మాస్ లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.‘జం జం జజ్జనిక’ ( Jam Jam Jajjanika )అంటూ సాగే ఈ సాంగ్ సెలెబ్రేషన్ సాంగ్ అని తెలిపారు.అందుకే ఈ సాంగ్ పై మరింత ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

మొత్తం సాంగ్ ను జులై 11న రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube