బాధిత కుటుంబాలకు అండగా బిజిఆర్ ఫౌండేషన్

నల్లగొండ జిల్లా:కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు బిజిఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ నేత బాచుపల్లి గంగాధర్ రావు తెలిపారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో ఇటీవల కాలం మరణం చెందిన భిక్షం,మేడిపల్లి పిచ్చయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

తక్షణ సహాయంగా రెండు కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ కొండేటి సైదులు, మాజీ వార్డు సభ్యులు తిరుమల నాగయ్య,గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూల శ్రీకాంత్,గ్రామ పెద్దలు బుల్లెదు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నవారు.

BGR Foundation Stands By The Affected Families, BGR Foundation, Nalgonda Distric

Latest Nalgonda News