ఆ విషయంలో బెంగళూరు మరో రికార్డు క్రియేట్ చేసిందిగా..!

బెంగళూరు. ఎప్పుడు ఎదో ఒక విషయంలో ట్రేండింగ్ లో ఉంటుంది.బెంగళూరులో అన్ని రాష్ట్రాల వారు ఉంటారు.చాలా మంది ఇక్కడే ఎదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతుంటారు.బెంగళూరు చాలా పెద్దది కాబట్టి ఎప్పుడు రద్దీ గానే ఉంటుంది.ప్రతిరోజు వేలాది మంది బెంగళూరుకు వస్తుంటారు, పోతుంటారు.

 Bangalore Create New Record With 107 Languages Talking People, Bengaluru, Langua-TeluguStop.com

కొంత మంది ఇక్కడే ఉండిపోడానికి కూడా వస్తుంటారు.ఇలా బెంగళూరు చాలా విషయాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా బెంగళూరు మరో రికార్డు క్రియేట్ చేసింది.

ప్రస్తుతం అత్యధిక భాషలు మాట్లాడే లిస్ట్ లో బెంగళూరు స్థానం సంపాదించుకుంది.

బెంగుళూరు జిల్లాలో 107 భాషలు మాట్లాడుతున్నారు.దేశంలో మరెక్కడా కూడా ఇన్ని భాషలు మాట్లాడడం లేదు.

బెంగళూరుది అదే ప్రత్యేకత.ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా బెంగళూరు స్వాగతిస్తోంది.

అలా చాలా మంది బ్రతుకుదెరువు కోసం బెంగళూరుకు వచినవారున్నారు.బెంగళూరు కర్ణాటక రాజధాని.

బెంగళూరులో కన్నడతో పాటు చాలా భాషలు నిత్యం వింటూనే ఉంటారు.అయితే ఏకంగా 107 భాషలు మాట్లాడుతున్నారు అంటే గొప్ప విషయమే అనే చెప్పాలి.

బెంగళూరు తరువాత వందకు పైగా భాషలు మాట్లాడే జిల్లాల్లో నాగాలాండ్‌ రాష్ట్రంలోని దిమాపూర్‌, అసోం రాష్ట్రంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలు ఉన్నాయి.

Telugu Languages, Assam, Bengaluru, India, Kannada, Karnataka, Nagaland, Sonitpu

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 640 జిల్లాలు ఉండగా.వీటిలో మూడు జిల్లాలో 100కు పైగా భాషలు మాట్లాడుతున్నారు.ఇక బెంగళూరు జిల్లాలో 44.5% మంది కన్నడ, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 6% హిందీ, 3% మంది మలయాళం మాట్లాడే వారున్నారు.ఇక భాషల వివరాలను 2011 సెన్సస్ డాటా ఆధారంగా వెల్లడించారు.

అయితే బెంగళూరులో కన్నడ కంటే ఎక్కువగా వేరే భాషలే మాట్లాడుతారు అనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube