బావను చంపి గోనె సంచిలో కట్టి కాలువలో పడేసిన బామ్మర్ది...!

నల్లగొండ జిల్లా:భూమి తగాదాల విషయంలో సొంత అక్క భర్తను బామ్మర్ది అతి దారుణంగా హత్య చేసి,గోనె సంచిలో మూటగట్టి కాలువలో పడేసిన ఘటన నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేటలో శనివారం వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా( Nagar Kurnool District ) పదరా మండలం మారడుగు గ్రామానికి చెందిన సవట ఆంజనేయులుకి గుర్రంపోడు మండలం మోసంగి గ్రామానికి చెందిన రేణుకతో వివాహం జరిగింది.

వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.హైదరాబాదులో పెయింటింగ్ పనిచేస్తు జీవనంగా సాగిస్తున్న ఆంజనేయులు అంగడిపేట క్రాస్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.

Bamardi Who Killed His Brother-in-law And Tied Him In A Sack And Threw Him In Th

బావ ఆంజనేయులుకి బామ్మర్ది నిరసనమెట్ల వెంకటయ్యకు ( Venkataiah )మధ్య భూమి విషయంలో వివాదం ఏర్పడి బావ ఆంజనేయులును బామ్మర్ది వెంకటయ్య తలపై సుత్తితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.దీనితో బావ మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి పక్కనే ఉన్న పీఏపల్లి మండలం డిస్ట్రిబ్యూటర్ లెవెల్ కాలువల పడవేశారు.

అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అంగడిపేట లెఫ్ట్ కెనాల్ లో శనివారం మృతదేహం లభ్యమైంది.

Advertisement

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News