ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ - ఖమ్మం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు , శాంతిదూత , ప్రపంచ స్థాయిలో వేలాది అవార్డులు పొందిన సద్గురువులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ( జన్మదిన ) పుట్టినరోజు సందర్బంగా విడిఓస్ కాలనీ సాయిబాబా ధ్యాన మందిరంలో శుక్రవారం రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఐ అంజలి పాల్గొని ప్రారంభించి మాట్లాడారు .

 Art Of Living Organization - Blood Donation Camp Under The Auspices Of Khammam-TeluguStop.com

మనిషి ఆనందం , ఆరోగ్యం మరియు ఆదర్శవంతమైన జీవితాన్ని పొందాలనుకుంటే యోగా చేయాలని , దీని వలన రోగనిరోధక శక్తి పెరిగి , శారీరక ఆరోగ్యం మెరుగుపడి మానసిక వత్తిడి తగ్గుతుందన్నారు .ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యోగా , లాంగ్ సుదర్శన క్రియ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ఒక భాగమని తెలియజేశారు .సత్సంగ్ భజన కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను వితరన చేశారు .ఈ కార్యక్రమంలో యోగా టీచర్ జి.శ్రీనివాస్ రెడ్డి , టి.కోటేశ్వరరావు , బి.చైతన్య కిషోర్ , నయీమ్ , హరిబాబు , వేముల రామ్మోహన్ రావు , గోపాల్ , డాక్టర్ బాలు , ల్యాబ్ టెక్నీషియన్ సరిత , పీఆర్వో దినేశ్ , ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube