శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ద్వితీయ మహసభలను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ హాజరై ప్రారంబించారు.
ఈకార్యక్రమానికి హజరు కావడం చాలా సంతోషం కలిగించిందన్నారు.బారీగా హజరైనా తెలంగాణ పరిషత్ న్యాయవాదులు రాష్ట్ర నలుమూల నుంచి హజరైనారు.
సత్వర న్యాయం, న్యాయవాదుల పాత్ర అనే అంశంపై చీఫ్ జస్టిస్ ప్రసంగించారు.తమ ప్రసంగం లో పలు కేసులను ఉదహరించారు.
సత్వర కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో పాటు కక్ష ి దారులు కూడా సహకరించాలి.సత్వర న్యాయం వలన కక్షిదారులు లబ్ధి పొందుతారు.
సత్వర న్యాయానికి అధునిక టెక్నాలజీ ని కూడా ఉపయోగించాలన్నారు.ప్రపంచంలో మన దేశ న్యాయవ్యవస్థ గొప్పదన్నారు.
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010 సంవత్సరం లో రాసిన తన పుస్తకం లో సత్వర న్యాయం అనే అంశంపై తన పుస్తకం లో రాశారు.
ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ పేదవాడి కి ఒక న్యాయం , ధనిక లకు ఒక న్యాయం ఉండకూడదు.కార్పొరేట్ లకు ఒక న్యాయం పేద వాడికి ఒక న్యాయం ఉండకూడదు.
సత్వర న్యాయం లో న్యాయమూర్తుల పాత్ర కీలకం అని అన్నారు.కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు కూడా సహకరించాలు.
పలువురు వక్తలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తుల తో పాటు ఖమ్మం పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్ , జస్టిస్ కె.లక్ష్మణ్ , జస్టిస్ రాజేశ్వర్ రావు , జస్టిస్ నగేష్ .న్యాయవాద పరిషత్ కె.శ్రీనివాస మూర్తి , టి.సూర్యకరణ్ రెడ్డి , కరూర్ మొహన్ , సునీల్ , కె.విజయ్ కుమార్ , ఎస్.వెంకటేశ్వర గుప్తా లతో పాటు హర్కార్ శ్రీరామారావు , జి.సత్యప్రసాద్ , తెల్లాకుల రమేష్ , నెరెళ్ళ శ్రీనివాసరావు , కూరపాటి శేఖర్ రాజు , పసుమర్తి లలిత సీనియర్ , జూనియర్ న్యాయవాదులతో పాటు ఖమ్మం ఉభయ జిల్లా ల నుండి న్యాయవాద పరిషత్ న్యాయవాదులు బారిగా హజరైనారు.







