ఖమ్మం జిల్లాలో యూనిట్ల స్థాపనకు టిఎస్-ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టీఎస్-ఐపాస్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 6 యూనిట్ల స్థాపణకుగాను 11 అనుమతులకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు సంబంధించి 3 దరఖాస్తులు అనుమతి కొరకు పరిశీలనలో ఉన్నాయన్నారు.
విద్యుత్ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులకుగాను అనుమతుల ప్రక్రియ ప్రగతిలో ఉందన్నారు.ఫ్యాక్టరీలకు సంబంధించి 3 దరఖాస్తులకుగాను 1 దరఖాస్తుకు అనుమతి ఇవ్వగా, 2 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు.
పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 1 దరఖాస్తు పరిశీలనలో ఉందని కలెక్టర్ తెలిపారు.పరిశీలన ప్రక్రియలో దరఖాస్తులు తిరస్కరించక, దరఖాస్తుదారునితో ఆయా అనుమతికి కావాల్సినవి సమర్పణకు వారికి సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, జిఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, ఎల్డిఎం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.







