ఆగస్ట్ 1 నుంచి రూ.10వేల వరద పరిహారం- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

భద్రాచలం వరద ముంపు బాధితుల పునరావాసానికి సీఎం కేసిఆర్ ప్రకటించిన రూ.10 వేల రూపాయల పరిహారం ఆగస్ట్ 1 నుంచి బాధితుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.ఈ మేరకు శనివారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

 Compensation Will Credit To Flood Victims From August Says Minister Puvvada Ajay-TeluguStop.com

వరద బాధిత కుటుంబాలు ఒక్కింటికి 20 కిలోల, 5 కిలోల కందిపప్పు 2 నెలలపాటు ఉచితంగా ఇస్తామని, రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని సీఎం కేసిఆర్ భద్రాచలం పర్యటనలో హామీ ఇచ్చారని ఈ మేరకు బాధితులకు సహాయార్థం సేకరించిన వారి వివరాల ప్రకారం ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు పంపిణీ పూర్తయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసిఆర్ రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారని, పట్టణ కాంటూరు లెవల్స్‌ను పరిగణనలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube