బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి- ప్రభుత్వానికి పాస్టర్లు విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వైకుంఠ ధామం ,ముస్లింలకు కబరస్థాన్ ను ఏ విధంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా క్రిస్టియన్లకు కొరకు బరియల్ గ్రౌండ్ -సమాధుల తోట ను,అలాగే ప్రతి మండలాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా పాస్టర్స్ విజ్ఞప్తి చేశారు ఈ మెరకు డీఆర్వో శిరీష కు ,రఘునాథపాలెం మండలం ఎమ్మార్వో నరసింహారావు కు క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు కొరకు సుమారు వెయ్యి గజాల స్థలం మరియు ఒక్కొక్క మండలానికి మూడు ఎకరాలు సమాధుల కొరకు కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశారు .

అట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్లాలని ఈ సారైనా వీలైనంతవరకూ మా సమస్యను పరిష్కరించాలని విన్నవించారు .

గతంలో కూడా ఈ విషయంపై పలు అధికారులను , రాజకీయ నాయకులను కలిసిన ఇంతవరకు మాకు ఎటువంటి స్థలాన్ని చూపించలేదని పేర్కొన్నారు .చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న క్రిస్టియన్లు చనిపోతే వారిని సమాధి చెయ్యటానికి స్థలం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పాస్టర్ వింగ్ ఎస్.ఎస్.బి.ఎం.మహాసేన అధ్యక్షులు మంద .సంజీవ రావు , కార్యదర్శి వెగ్గళం.ఇమ్మానుయేలు , కోశాధికారి యన్ .లాజర్ , ఉపాధ్యక్షులు జోసెఫ్ నాయక్ , బోడా దానియేలు , నందిపాటి అభిషేక్ , శామ్యూల్ , విజయ్ కుమార్ , సురేష్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?

Latest Khammam News