ఇక్కడ ఎన్నికల నిబంధనలు వర్తించవా ...?

నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణంలో ప్రధాన రహదారుల వెంట, పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో అధికార పార్టీ నేతలు ఫ్లెక్సీలు నిబంధనలకు విరుద్ధంగా దర్శనమిస్తున్నాయి.

కొన్నింటిని తొలగించిన అధికారులు పలుచోట్ల అలాగే ఉంచారు.దీనితో ప్రతిపక్ష పార్టీల లీడర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Are Election Rules Applicable Here, Election Rules,b Nalgonda District, Miryalag

బీఆర్ఎస్ ఫ్లెక్సీలను అలాగే ఉంచడంపై ప్రతిపక్ష లీడర్లు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారాయి.ఇప్పటికైనా ఎన్నికల విధులు నిర్వర్తించే ఆఫీసర్లు ఫ్లెక్సీలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

Latest Nalgonda News