దిమ్మతిరిగే ధరలలో యాపిల్‌ కంపెనీ బూట్లు.. ధర వింటే షాక్ అవుతారు!

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్‌ కంపెనీ( Apple Company ) ఉత్పత్తులకు ఎంత డిమాండ్‌ ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్‌ ఏవైనా, ధర ఎలాగున్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్‌ మరే బ్రాండుకి ఉండదని అందరికీ తెలిసిందే.

 Apple Rare Sneakers Sold For 50000 Dollars At Auction Details, Apple Company, Ap-TeluguStop.com

ఇటీవల యాపిల్‌ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి అధిక మొత్తంలో అమ్ముడు పోయిన విషయం తెలిసినదే.మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్‌లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది అంటే మీరు నమ్ముతారా?

Telugu Dollars, Apple Boots, Apple, Apple Company, Apple Products, Applerare, Ap

నిజం, ఆ బూట్లు ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు.విషయంలోకి వెళితే, దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో ఒక నమూనా స్మార్ట్ బూట్లను( Smart Shoes ) తయారు చేసింది.కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్లను మార్కెట్లో వేలం పెట్టింది.1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేయగా యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 అంటే సుమారు 41 లక్షల రూపాయలకు అమ్మారన్నమాట.తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది.

Telugu Dollars, Apple Boots, Apple, Apple Company, Apple Products, Applerare, Ap

1986లో ఈ కంపెనీ “ది యాపిల్ కలెక్షన్”ను( The Apple Collection ) స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో మగ్‌లు, బ్యాగులు, గొడుగులు, కీరింగ్‌లు, సెయిల్‌బోర్డ్‌తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి.ఇక మీకు తెలియని విషయమేమిటంటే, వింటేజ్‌ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు.

ఇటీవల వేలంలో యాపిల్‌ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.గత నెలలో, ఐఫోన్‌ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు( Steve Jobs ) చెందిన ఒక జత బిర్కెన్ స్టాక్ చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి.

అదన్నమాట సంగతి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube