ఢిల్లీకి ఏపీ గ‌వ‌ర్న‌ర్‌.. చంద్ర‌బాబు ఫిర్యాదుపై చ‌ర్చిస్తారా..?

ఏపీ రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటుచేసుకుంటోంది.ఇప్ప‌టి దాకా వైసీపీ, టీడీపీ న‌డుమ జరుగుతున్న దాడుల విష‌యంలో ఎంత‌లా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే.

 Ap Governor To Delhi .. Will Chandrababu Discuss The Complaint ..?, Chandrababu,-TeluguStop.com

కాగా దీనిపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి మ‌రీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి మ‌రీ జ‌గ‌న్ మీద ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో అశాంతి పెరుగుతోంద‌ని కాబ‌ట్టి ఆర్టికల్ 356ను పెట్టి ఏపీలో వెంట‌నే రాష్ట్రపతి పాలన విధిచాలంటూ విజ్ఞ‌ప్తి కూడా చేశారు.

ఇక దీనిపై అటు వైసీపీ కూడా ఫుల్ సీరియ‌స్ గా ఉంది.ఆ పార్టీ ఎంపీలు కూడా అమిత్ షాను క‌లిసి ఫిర్యాదు చేశారు.

అయితే ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంటోంది.

ఇప్పుడు ఏపీ గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్తున్నారు.

హ‌రిభూష‌న్ నేరుగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు.ఈ క్ర‌మంలోనే రాష్ట్రపతి అంద‌రు గ‌వ‌ర్న‌ర్ల‌తో రెండు నుంచి మూడు నిముషాల దాకా భేటీ అవుతార‌ని ఆ క్ర‌మంలోనే ఆయా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాలు మాట్లాడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

అయితే ఇంత‌కు ముందు చంద్రబాబు రాష్ట్ర‌ప‌తిని కలిసి చేసిన ఫిర్యాదు మీద కూడా గ‌వ‌ర్న‌ర్ తో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఇక దాంతో పాటే వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేసిన దాడుల మీద కూడా మాట్లాడుతారు.

Telugu Ap Potics, Article, Chandrababu, Delhi, Ramnadh Kovindh, Tdp, Ysrcp-Telug

అలాగే ఏపీలో పెరిగిపోతున్న అప్పుల విష‌యం మీద కూడా ఈ మ‌ధ్య జాతీయ మీడియాలో విప‌రీతంగా వార్తలు వస్తున్న విష‌యం మీద చ‌ర్చించే అవ‌కాశం లేక‌పోలేదు.దీని మీద అంటే ఈ పెరిగిపోతున్న అప్పుల మీద అటు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ప‌లు సార్లు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో రామ్ నాథ్ కోవింద్ మాట్లాడే ఛాన్స్ ఉంది.గ‌తంలో అప్పులు తెచ్చుకోవ‌డం కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం గవర్నర్ పేరును చేర్చ‌డంపై గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించే ఛాన్స్ ఉంది.మొత్తంగా ఈ భేటీ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube