నిఖిల్ కు జోడీగా క్యూట్ హీరోయిన్.. ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం కంటే అదృష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.ఇక్కడ వరుసగా రెండు మూడు హిట్లు వస్తే గోల్డెన్ లెగ్ అని రెండు మూడు ఫ్లాపులు వస్తే ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తూ ఉంటారు.

 Anupama Parameshwaran Confirms For Nikhil 18 Pages, 18pages, Anupama Officially-TeluguStop.com

అలా అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాక అవకాశాలు లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.ఈ మల్లూ బ్యూటీకి రాక్షసుడు సినిమా తరువాత తెలుగులో నిఖిల్ కు జోడీగా 18 పేజెస్ సినిమాలో అవకాశం దక్కింది.
వాస్తవానికి చాలా కాలం నుంచే ఈ సినిమాలో అనుపమ నటిస్తున్నట్టు వార్తలు వెలువడినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.అయితే అనుపమ నిన్న సాయంత్రం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ 18 పేజెస్ సినిమాలో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

గీతా ఆర్ట్స్ 2 ట్విట్టర్ ఖాతా నుంచి 18 పేజెస్ సినిమాలోకి అనుపమ పరమేశ్వరన్ కు స్వాగతం పలుకుతున్నామని.అనుపమతో ప్రయాణం అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నామనే ట్వీట్ కు అనుపమ స్పందించి సినిమాలో నటించబోతున్నట్టు కన్ఫమ్ చేశారు.

ప్రస్తుతం అనుపమ తమిళ, మలయాళ భాషల్లో చెరో సినిమాలో నటిస్తున్నారు.త్వరలో 18 పేజెస్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే అనుపమకు స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు రావచ్చు.అర్జున్ సురవరం సినిమా సక్సెస్ తో హిట్ ట్రాక్ లో ఉన్న నిఖిల్, అనుపమతో కలిసి నటించడం ఇదే తొలిసారి.

గీతా ఆర్ట్స్ 2తో పాటు సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాకు కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా హిట్టైతే కార్తికేయ 2 సినిమాలో కూడా అనుపమనే తీసుకోవాలని నిఖిల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube