బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి ప్రేమ, పెళ్లి గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి.అయితే ఆ తరువాత ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
అయితే తాజాగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే స్టార్ట్ మ్యూజిక్ షో తాజా ప్రోమోలో శ్రీముఖి ప్రేమ గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గతంలో స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు శ్రీముఖి, ఝాన్సీ యాంకర్లుగా వ్యవహరించగా ఇప్పుడు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోకు సుమ యాంకర్ అయిన తరువాత మంచి టీఆర్పీ రేటింగ్ లు కూడా వస్తున్నాయి.సుమ శ్రీముఖిని ఇక్కడ ఉండే సెలబ్రిటీలలో నీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు ? అని ప్రశ్నిస్తుంది.శ్రీముఖి సుమ ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి గారు అని చెబుతారు సుమ వెంటనే రొమాంటిక్ డేట్ కు వెళతారా ? అని అడగగా అంటే శ్రీముఖి వెళ్లను అంటూ అందుకు కారణాలను కూడా వెల్లడిస్తారు.
తాను ఇప్పటికే కమిటెడ్ అని తన బాయ్ ఫ్రెండ్ ఈ షో చూస్తాడని నాకు కొన్ని రూల్స్ & రెగ్యులేషన్స్ ఉన్నాయని అందువల్ల తాను డేట్ కు వెళ్లనంటూ శ్రీముఖి కామెంట్లు చేశారు.అయితే శ్రీముఖి నిజంగా ప్రేమలో ఉన్నారో లేక సరదాగా అలా అన్నారో తెలియాల్సి ఉంది.బిగ్ బాస్ షో సీజన్ 3 లో పాల్గొన్న శ్రీముఖి అందరూ విన్నర్ అవుతారని భావించగా శ్రీముఖి రన్నర్ గా నిలిచారు.
బిగ్ బాస్ షో తర్వాత జీ తెలుగు ఛానల్ లో బొమ్మ అదిరింది షోకు కొంతకాలం యాంకర్ గా చేసిన శ్రీముఖి ఆ షో ఆగిపోవడంతో కొన్ని ఈవెంట్లలో సందడి చేస్తున్నారు.గతంతో పోలిస్తే యాంకర్ గా ఆఫర్లు తగ్గిన శ్రీముఖి మళ్లీ వరుస షోలతో బిజీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.