అన్న అండదండలు లేకుండానే స్టార్‌ అవుతానంటున్న జూనియర్‌ రౌడీ

విజయ్‌ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు దొరసాని సినిమాతో ప్రేక్షకులకు ఆనంద్‌ దేవరకొండ పరిచయం అయ్యాడు. రౌడీ స్టార్‌ అనే ట్యాగ్‌ ను కలిగి ఉన్న ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

 Anand Devarakonda Don't Want His Brother Vijay Devarakonda Help In His Movies, M-TeluguStop.com

కాని ఆనంద్‌ మాత్రం తన సినీ కెరీర్‌లో ఎక్కడ కూడా అన్నయ్య విజయ్‌ పేరు వాడుకోవడం లేదు అంటున్నాడు.ప్రస్తుతం ఆయన పేరు వాడుకున్నా వాడినా కూడా ఖచ్చితంగా అన్న పేరుతోనే ఆనంద్‌ ను పిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ విషయాన్ని ఆనంద్‌ మర్చిపోతున్నట్లుగా ఉన్నాడు.తాజాగా ఈయన నటించిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.

ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వడంతో పాటు సినిమా ప్రమోషన్‌లో బిజీ అయ్యారు.

Telugu Middle Class, Telugu, Vijay Anand-Movie

ఓటీటీ ద్వారా రాబోతున్న ఆ

సినిమా ప్రమోషన్‌లో

భాగంగా ప్రముఖ దిన పత్రికతో ఆయన మాట్లాడాడు.ఆ సందర్బంగా మాట్లాడుతూ తన సినిమాల విషయంలో అన్నయ్య విజయ్‌ దేవరకొండ ఇన్వాల్వ్‌ మెంట్‌ ఏమీ ఉండదు.ఎందుకంటే నా నిర్ణయాలు నేను తీసుకోవడం మొదటి నుండి నేర్చకున్నాను.

నాకంటూ ప్రత్యేకంగా ఒక ఆలోచన ఉంటుంది.నా అభిరుచికి తగ్గట్లుగా సినిమాను చేయాలని భావిస్తున్నాను.

అన్నయ్య సూచన మేరకు సినిమాలు చేస్తే ఆయన సినిమాలు వస్తాయి.ఎందుకు ఆయన వంటి సినిమాలే మీరు చేస్తున్నారు అంటారు.

అందుకే నేను నా సొంతంగా సినిమాల నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నా సినిమాల విషయంలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటాను అంటూ ఆనంద్‌ చెప్పాడు.

అన్న అండదండలు లేకుండానే ఎదగాలనే ప్రయత్నాలు నేను చేస్తున్నాను అన్నాడు.చిరంజీవి తమ్ముడిగా ఎంతో క్రేజ్‌ ఉన్నా కూడా పవన్‌ మాత్రం సొంతంగానే ఎదిగాడు అనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube