తెల్లవారుజామున రాష్ట్రం వణికింది..

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామున రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.

3 పాయింట్స్ గా అధికారుల అంచనా వేశారు.భూమి లోపల 40 కి.మీ నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్టు అధికారులు తేల్చారు.నల్గొండ జిల్లా,నకిరేకల్ చిట్యాలలో భూ ప్రకంపనలతో భారీ శబ్దాలు రావడంతో జనం భయంతో ఇంటి నుంచి బయటికి పరుగులు తీశారు.

సూర్యాపేట జిల్లాలో జిల్లా కేంద్రంలో మునగాల మండలంలో భూ ప్రకంపనలతో స్వల్పంగా భూమి కంపించింది.దీనితో స్థానికుల భయాందోళనకు గురయ్యారు.యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్, అర్వపల్లి,యాదగిరిగుట్టలో ఉదయం 7:23 గంటలకు 3 నుండి 5 సెకండ్ల వరకు స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళన చెందారు.ఒక్కసారి ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరయ్యాయి.

భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement
దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!

Latest Nalgonda News