సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులకు పక్కా ఆధారాలు.. బన్నీ కెరీర్ కు ఇబ్బందేనా?

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట( Sandhya Theatre Stampede ) ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది.అందులో భాగంగానే తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

 Allu Arjun Questioning By Police In Sandhya Theater Stampede Case With Solid Evi-TeluguStop.com

అల్లు అర్జున్‌ కు( Allu Arjun ) పోలీసులు స్టేషన్‌ కు పిలిచి విచారణ చేపట్టారు.అల్లు అర్జున్ బెయిల్( Bail ) రద్దు విషయాన్ని పోలీస్ శాఖ సీరయస్‌ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే ఈ సారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సవాల్ చేస్తూ.సుప్రీం కోర్టుకు( Supreme Court ) వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది.అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోందట పోలీస్ విచారణ బృందం.

Telugu Allu Arjun, Inquiry, Sandhyatheatre, Tollywood-Movie

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ కు మరోసారి పోలీసులు విచారణ జరపడం ఆసక్తికరంగా మారింది.అయితే సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ కు దిగుతున్నారు.రంగంలోకి దిగిన పోలీసులు ఏకంగా అల్లు అర్జున్‌ ను మరోసారి పోలీస్ స్టేషన్‌ కు పిలిపించి విచారణ చేపట్టారు.అయితే ఏయే అంశాలపై స్టేట్‌ మెంట్‌ రికార్డు చేస్తారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఆల్రెడీ మధ్యంతర బెయిల్‌ పై ఉండటంతో జనవరి 21 వరకైతే అరెస్ట్‌ ఛాన్స్‌ లేదు.కానీ బెయిల్‌ రద్దుపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు.ప్రత్యేకించి బెయిల్‌ రూల్స్‌ కు విరుద్ధంగా అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టారనేది పోలీసుల వాదన.

Telugu Allu Arjun, Inquiry, Sandhyatheatre, Tollywood-Movie

అంతేకాదు సంధ్య థియేటర్‌ కి వెళ్లొద్దని చెప్పినా వెళ్లారని ఆధారాలను వీడియోలను బయట పెట్టారు.ఇక ప్రెస్‌మీట్‌ లో అల్లు అర్జున్ చెప్పిన అంశాల ప్రాతిపదికగా ప్రశ్నలు సిద్ధం చేశారట.మొత్తంగా చూసుకుంటే ఈ విషయం పట్ల ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో చివరికి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ కెరీర్ ప్రాబ్లం లో పడుతుందా? బన్నీ కేరిర్ కు ఇబ్బంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube