తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో, ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి రాజకీయ వలసలు జోరందుకున్నాయి.ఒక పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు వెంటనే మరో పార్టీలో చేరి కీలక హామీలు పొందుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను విడుదల చేసింది.ఇంకా పూర్తిస్థాయి జాబితాను విడుదల చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీ( BRS Congress Party )ల మధ్య రాజకీయ వలసలు చోటు చేసుకుంటున్నాయి.ఎన్నికల సమీపిస్తుండడంతో జంపింగ్ నేతల సంఖ్య ఎక్కువ అవుతున్నాయి.
టికెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే , ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు చేపడుతూ, తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకుంటున్నారు.గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి వస్తుందనే ఆశతో కొంతమంది ఉంటున్నారు .అసెంబ్లీ ఎన్నికల ( Assembly elections )సమయంలో నియోజకవర్గస్థాయి నాయకులకే కాకుండా , ద్వితీయ శ్రేణి నాయకులకు భారీగా డిమాండ్ ఏర్పడింది .దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి.బీఆర్ఎస్( BRS ) అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో, ఆ పార్టీ లో టికెట్ ఆశించి బంగపడిన నేతలు వెంటనే కాంగ్రెస్ లోకి చేరిపోయారు .దీనికి కౌంటర్ గా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో బలంగా ఉన్న నాయకులను గుర్తించి వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహానికి బీ ఆర్ ఎస్ సిద్ధమైంది.
కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో విభేదాలు కారణంగా ప్రత్యామ్నయం గురించి ఆలోచిస్తూ ఉండగా, మరి కొంతమంది వేరే పార్టిటీలో టికెట్ గ్యారెంటీగా వస్తుందని భావించి పార్టీ మారిపోతున్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి , ద్వితీయ శ్రేణి నాయకుల వలసలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల( BRS party ) మధ్య ఈ వలసలు జోరందుకున్నాయి.