అఖిల్ నిర్ణయం ఎలా ఉండబోతోందో!

ఈ నెల 13 లేదా 14వ తేదికి అఖిల్ నటించబోయే రెండొవ సినిమా గురించి అన్నౌన్స్ చేస్తారని బలమైన టాక్ వినిపిస్తోంది ఫిలింనగర్ లో.మాస్ సినిమా అంటూ మొదటిచిత్రం అఖిల్ తో చేతులు కాల్చుకున్న అక్కినేని వారసుడు, మళ్లీ తప్పటడుగు వేయకూడదని, నాగార్జున దగ్గరుండి కథాచర్చలు జరిపిస్తున్నారు.

 Akhil And Vamsi Paidipally In Serious Discussions-TeluguStop.com

ఊపిరితో మంచి విజయంతో పాటుగా మంచి పేరుని సంపాదించుకున్న వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే అఖిల్ రెండొవ సినిమా ఉండటం దాదాపు ఖరారైనట్లే.

ఈరోజు కూడా అఖిల్, నాగార్జున,వంశీ పైడిపల్లి అక్కినేని వారింట్లో సమావేశమయ్యారు.

నాగార్జున మనసంతా హిందీ బ్లాక్బస్టర్ “యే జవాని హై దివాని” మీదే ఉంది.అందుకు కారణాలు లేకపోలేదు.

యే జవాని హై దివాని, రణబీర్ కపూర్ కి స్టార్ డమ్ సంపాదించిపెట్టిన సినిమా.స్నేహం,ప్రేమ,జీవితపు అనుభవాలు .ఇవన్ని మిళితమై, యువతను ఆకట్టుకునేలా ఉంటుంది ఈ చిత్రం.అఖిల్ ఉన్న వయసుకి ఇదే సరైన సినిమా అని నాగార్జుమ భావన.

పైగా రిమేక్ సినిమా అంటే సేఫ్ గేమ్.

ఇక నిర్ణయం అఖిల్ చేతిలోనే ఉంది.

ఈరోజు జరిగిన ముచ్చట్లలో ఏం డిసైడ్ అయ్యారో తెలియదు కాని, రీమేక్ వైపే గాలి తిరిగేలా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube