వ్యవసాయ మోటార్ల దొంగలు అరెస్ట్...!

సూర్యాపేట జిల్లా: వ్యవసాయ మోటార్లు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు గురువారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఏ1 గోలి సైదులు,ఏ2 పోరెడ్డి నాగేందర్ రెడ్డి,ఏ3 ఎస్.

కె.మదార్ నిందితులు మద్యానికి,చెడు వ్యసనాలకు బానిసలై,గత 45 రోజుల నుండి వ్యవసాయ మోటార్లు దొంగతనాలకు పాల్పడుతున్నారనిఅన్నారు.గురువారంకానిస్టేబుళ్లు కొండలు, మట్టయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగానిందితులు మోటార్లు అమ్మడానికి వెళ్తుండడంతో పోలీసుల తనిఖీల్లో పట్టుపడ్డారన్నారు.

నేరేడుచర్లలో 3, జానలదిన్నెలో 1, యాదగిరిపల్లిలో 1,మొత్తం ఐదు మోటర్లు దొంగిలించినట్లు తెలిపారు.మోటార్ల విలువ దాదాపు 1,10,000/ వేల రూపాయలు ఉంటుందని అన్నారు.ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

వ్యూహం అదిరింది బాబాయ్ .. ! 
Advertisement

Latest Suryapet News