మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా పనిచేస్తున్న లక్ష్మీ బాలచంద్ర జాతి, లింగ వివక్షకు గురయ్యారు.అందుకే ఆమె ఆ కాలేజీపై దావా వేశారు.
భారతీయ సంతతికి చెందిన ఈమె తన సమస్యలను అడ్మినిస్ట్రేటర్లు పట్టించుకోకపోవడం వల్ల తాను కెరీర్ అవకాశాలు కోల్పోయానని తెలిపారు.ఆర్థిక నష్టాలు చవి చూశానని, మానసిక క్షోభకు గురయ్యానని, ప్రతిష్టకు భంగం కలిగిందని బాలచంద్ర పేర్కొన్నారు.
కాలేజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ప్రొఫెసర్, మాజీ చైర్ అయిన ఆండ్రూ కార్బెట్ వల్ల ఈ వివక్ష జరిగిందని ఆమె ఆరోపించారు.
బాలచంద్ర 2012లో బాబ్సన్ కాలేజీ ఫ్యాకల్టీలో చేరి, 2019లో పదవీకాలం పొందారు.అయితే, ఎంఐటీ స్లోన్ స్కూల్‌లో తాను ఇంతకు ముందు ఎలక్టివ్‌లను టీచ్ చేశానని కానీ బాబ్సన్ కాలేజీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను బోధించడానికి మాత్రమే తనకు అనుమతి లభించిందని ఆమె ఆరోపించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో కూడా తాను ఎలక్టివ్‌లను బోధించానని అన్నారు.
పరిశోధనా రికార్డు, ఆసక్తి ఉన్నా, కళాశాలకు సేవ చేసినా తనకు అనేక లీడర్‌షిప్ పొజిషన్స్ ఇవ్వలేదని వాపోయారు.
<img src=" https://telugustop.com/wp-content/uploads/2023/03/Massachusetts-discriminatory-work-environment-Lakshmi-Balachandra-Babson-College.jpg”/>
బోస్టన్‌లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, బాబ్సన్ కాలేజీ వైట్, మేల్ టీచర్లకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.ప్రధానంగా వారికి అవార్డులు, అధికారాలను కేటాయించింది.ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో శ్వేతజాతి పురుష అధ్యాపకులకు ఇలాంటి ప్రత్యేకాధికారాలు సింపుల్‌గా ఇచ్చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
వివక్షకు వ్యతిరేకంగా మసాచుసెట్స్ కమిషన్‌లో వివక్ష అభియోగాన్ని కూడా ప్రొఫెసర్ దాఖలు చేసినట్లు బాలచంద్ర తరపు న్యాయవాది మోనికా షా తెలిపారు.బాబ్సన్ కాలేజీ బాలచంద్ర ఫిర్యాదును సీరియస్‌గా పరిగణించింది.
క్యాంపస్‌లోని ప్రతి కోణంలోనూ సమానత్వం ఉండాలని స్పష్టం చేసింది.విభిన్న గ్లోబల్ కమ్యూనిటీకి ఇది నిలయమని, ఏ రకమైన వివక్షను సహించబోమని కళాశాల పేర్కొంది.