అమెరికాలో మళ్లీ తుపాకీ తూటాలు పేలాయి.ఇదివరకే ఎన్నో సార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా, వీటి నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు.
ఎందుకు ఇలా కిరాతకమైన పనులు చేస్తున్నారో అగంతకులు ఎంతకి అంతుచిక్కడం లేదు.
ఇకపోతే ఒమాహాలోని వెస్ట్‌రోడ్స్ మాల్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
ఈ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో మహిళ గాయపడిందని సమాచారం.కాగా ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో మాల్‌లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీస్తుండగా, ఈ ఘాతుకానికి పాల్పడ్ద అగంతకుడు మాత్రం పారిపోయాడని పోలీసులు తెలిపారు.
అయితే కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు.ఇలా ఒమాహా నగరంలో నెల రోజుల్లో రెండు సార్లు కాల్పులు జరగడం కలకలాన్ని రేపుతుంది.ఇకపోతే రెండు రోజుల కిందట ఇండియానాలో ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీస్ వద్ద జరిగిన కాల్పుల్లో ఎనిమిది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.