పూరి వరుస ఫ్లాప్‌లకు కారణం చెప్పిన నటి.. ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది  

Actress Hema Sensational Comments On Director Puri -

ఒకప్పుడు రాజమౌళి వంటి దర్శకులు కూడా పూరి జగన్నాద్‌ గారు ఒక గొప్ప దర్శకుడు అంటూ ప్రశంసలు కురిపించాడు.ఒకప్పుడు పూరి జగన్నాద్‌ అంటే మినిమం గ్యారెంటీ హిట్‌.

Actress Hema Sensational Comments On Director Puri

చిరంజీవి వంటి మెగాస్టార్‌ తన కొడుకు చరణ్‌ను పూరికి అప్పగించి సినిమాల్లో పరిచయం చేయమన్నాడు అంటే ఏ స్థాయిలో అప్పుడు పూరి క్రేజ్‌ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అద్బుతమైన చిత్రాలు చేసి ఇండస్ట్రీ హిట్స్‌ను దక్కించుకున్న పూరి జగన్నాధ్‌ పరిస్థితి ప్రస్తుతం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గత మూడు నాలుగు సంవత్సరాలుగా పూరి జగన్నాధ్‌ మూవీ అంటేనే నిర్మాతలు మరియు హీరోలు జంకుతున్నారు.అందుకు కారణం ఆయన పక్కన ఉన్న ఛార్మి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

పూరి వరుస ఫ్లాప్‌లకు కారణం చెప్పిన నటి.. ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా నటి హేమ కూడా అదే వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ తనకు పూరితో ఉన్న సన్నిహిత్యంపై స్పందించింది.ఇప్పటికి నాకు పూరితో మంచి రిలేషన్‌షిప్‌ ఉంది.ఆయన ఒక గొప్ప దర్శకుడు.

అయితే ఆయన పక్కనే ఉండే ఛార్మితో మాత్రం నాకు ఎలాంటి రిలేషన్‌ లేదు.పూరి మబ్బుల చాటున దాగి ఉన్న సూర్యడి మాదిరిగా ఉన్నాడు.

బయటకు వస్తే ప్రకాశిస్తాడు.కాని మబ్బుల్లోంచి రావాలనుకోవడం లేదు.

అదడు మబ్బుల్లో దాగినప్పటి నుండి కూడా అతడి ప్రాభవం తగ్గింది అన్నట్లుగా హేమ చెప్పుకొచ్చింది.మబ్బులో దాగి ఉండటం అంటే ఛార్మితో అతడు కలిసి ఉండటం అనేది హేమ అభిప్రాయం కావచ్చు.

ఛార్మితో ఉన్న సన్నిహిత్యంను అతడు వదులుకుంటే అప్పుడు అతడికి సక్సెస్‌లు వస్తాయనేది ఆమె అభిప్రాయం కావచ్చు.హేమ అభిప్రాయంతో ఎంతో మంది ఏకీభవిస్తన్నారు.తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం నిర్మాణంలో కూడా ఛార్మి ఇన్వాల్వ్‌ అయ్యింది.షూటింగ్‌ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటుంది.అందుకే ప్రతి చోట కూడా పూరి పక్కన ఛార్మి కనిపిస్తూ వస్తోంది.వరుసగా పూరి చేస్తున్న సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో ఛార్మి వల్లే అంటూ ఎక్కువ మంది అంటున్నారు.

మరి పూరి మాత్రం ఎందుకు ఆమెను వదలడం లేదో తెలియడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Hema Sensational Comments On Director Puri- Related....