కేటీఆర్ రోడ్ షో కి వెళ్తుండగా ప్రమాదం

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన కేటీఆర్ రోడ్ షో కి వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పీఏపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రమావత్ రాంబాబు ద్విచక్ర వాహనంపై రోడ్ షో వెళ్తుండగా ఎదురుగా వరి కోత మిషన్ బ్లేడుతో వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఢీ కొట్టడంతో మెడపై బ్లేడ్ కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించింది.

గాయపడిన రాంబాబును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు.ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide

Latest Nalgonda News