ఉచిత కరెంటుకు ఆధార్ ధ్రువీకరణ చేసుకోవాలి

నల్లగొండ జిల్లా: ఉచిత కరెంటుకు ఆధార్ ధ్రువీకరణ చేసుకోవాలని పెద్దవూర విద్యుత్ లైన్మెన్ నామిని కొండయ్య తెలిపారు.

ఆదివారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో గ్రామస్తుల నుండి ఉచిత గృహజ్యోతి పథకం కోసం ఆధార్ ధ్రువీకరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంటు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని,దానికి లబ్ధిదారుల నుండి ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ప్రజాపాలన కార్డు నెంబర్ కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్మెన్ కొప్పోలు మోహన్, కట్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Aadhar Verification Is Required For Free Electricity, Aadhar Verification , Free
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News