ఇటీవలే కాలంలో సోషల్ మీడియా వేదికగా పరిచయమై, ఆ తరువాత మోసపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.ఆన్ లైన్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ఆన్ లైన్ లో తెలియని వ్యక్తులతో పరిచయం చాలా ప్రమాదకరం.ఎప్పుడో ఓసారి మోసానికి గురికాక తప్పదు.
ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూ( Dehradun )న్ లో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే డెహ్రాడూన్ లోని పటేల్ నగర్ లో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి, తాను రిటైర్డ్ అవ్వడానికి ముందే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో తనకు సరియైన జోడి కోసం మ్యాట్రి మోనీ వెబ్ సైట్( Matrimony website ) లో వెతికేవాడు.మ్యాట్రి మోనీ వెబ్ సైట్లలో ఓ 20 ఏళ్ల యువతి పరిచయం అయ్యింది.
వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు చేరింది.ఆ యువతి తన వయస్సు 43 సంవత్సరాలు, తనకు విడాకులు అయిందని చెప్పింది.సొంతంగా ప్లాట్ కొందామని కొన్ని దఫాలుగా రూ.80 లక్షలు కాజేసి దారుణంగా మోసం చేసింది.చివరకు ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డెహ్రాడూన్ లోని పటేల్ నగర్ లో 63 ఏళ్ల సుందర్ ప్రకాష్ 2021 సెప్టెంబర్ లో బ్యాంకు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయ్యాడు.భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న తనకు ప్రీతి అనే అమ్మాయి మ్యాట్రి మోనీ వెబ్ సైట్ లో పరిచయమై తనకు 43 ఏళ్ల వయసు, తనకు విడాకులు అయిందని చెప్పింది.ఆమె ఆస్తి కొనుగోలు, అమ్మకంలో పనిచేస్తున్నానని చెప్పింది.
మొదట ప్రీతి రూ.20 లక్షలు ప్లాట్ కొనేందుకు సుందరకు ఇచ్చింది.ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆ మొత్తం డబ్బు తిరిగి చెల్లించాడు.ఈ క్రమంలో సుందర్ ప్రకాష్ ఆమెపై నమ్మకంతో డిసెంబర్ 2021 నుండి మే 2022 వరకు దాదాపుగా రూ.70 లక్షలు ఇచ్చాడు.ఆ తర్వాత మరోసారి పది లక్షల రూపాయలు ఇచ్చాడు.ప్రీతి కోరిక మేరకు ఒక ప్లాట్ కూడా కొనుగోలు చేశాడు.2022 అక్టోబర్ ఐదు న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.కానీ ఆరోజు సాయంత్రం వరకు ప్రీతి గుడికి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది.తాను మోసపోయిన విషయం గ్రహించిన సుందర్ మొదట పోలీసుల దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.
ఆ యువతి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవలే సుందర్ పోలీసులను ఆశ్రయించాడు.పోలీసులు( Police ) నిందితురాలైన ప్రీతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.