రామన్నపేట పట్టణ సమీపంలో టెక్స్‌టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలి:నూనె వెంకట్ స్వామి

నల్లగొండ జిల్లా:సిరిపురం,వెల్లంకి,భోగారం మరియు రామన్నపేట పట్టణాన్ని ఆనుకుని పద్మశాలి నేతన్నల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో వెయ్యిమంది చేనేత కార్మికులకు తలా 10 గుంటల భూమి చొప్పున ఇచ్చి,అందలో చేనేత మగ్గాలు (హాండ్లూమ్), మరమగ్గాలు (పవర్ లూమ్) ఏర్పాటు చేయడానికి టెక్స్‌టైల్ పార్క్ ను నిర్మించాలన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి( Venkat Swamy ) అన్నారు.

సోమవారం వెల్లంకి గ్రామంలో చేనేత కార్కికుల చేతి మగ్గాలు,మర మగ్గాల వద్దకు వెళ్ళి వారి కష్టాలను తెలుసుకొని మాట్లాడుతూ పద్మశాలీల ఇళ్ళ వద్ద స్థలం సరిపోక అవస్థలు పడుతున్నారని, టెక్స్‌టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వం సిధ్ధం కాకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో నేతన్నలను సమీకరించి పోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వరికల్ గోపాల్, నాయకులు కట్ట మహేందర్,నకిరెకంటి సతీష్,పున్న వెంకటేశం నేత,చిట్టిమళ్ళ శ్రవణకుమార్ యోధ, బొడ్డుపల్లి కాడయ్య పాల్గొన్నారు.

బీసీ కుల గణన వెనుక అసలు వ్యూహం ఇదా ? 

Latest Nalgonda News