కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) పర్యటన కొనసాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని తెలిపారు.
వ్యవసాయంలో సాంకేతిక విప్లవాన్ని సృష్టించాలన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.అలాగే రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
వ్యవసాయం( Agriculture )లో ఆర్థికంగా మరింత ఎదగాలన్నారు.రైతే దేశానికి వెన్నెముక అన్న మంత్రి పొన్నం వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంభించాలని సూచించారు.