వీర జవాన్ కు కడసారి కన్నీటి వీడ్కోలు...!

నల్లగొండ జిల్లా: దేశ సేవ కోసం ఆర్మీలో చేరి అస్సోం రాష్ట్రంలోని దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మరణించిన వీర జవాన్ ఈరేటి మహేష్‌ అంత్యక్రియలు స్వగ్రామం నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెంలో శనివారం కుటుంబ సభ్యులు,బంధువుల రోదనలు,వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య,రాజకీయ,కులమతాలకు అతీతంగా భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రముఖులు,నేతలు,యువత అర్పించిన నివాళులతో ముగిశాయి.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతిమయాత్ర హాలియా నుండి మదారిగూడెం వరకు సుమారు మూడు కిలోమీటర్లు పొడవునా జనసంద్రమై సాగింది.

సరిహద్దులో మృతి చెందిన ఈరేటి మహేష్‌ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో పూర్తి చేశారు.ఆర్మీ జవాన్లు అంత్యక్రియలకు ముందు సైనిక లాంఛనాలతో గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు.

A Tearful Farewell To Martyred Jawan Ereti Mahesh, Tearful Farewell ,martyred J

ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Advertisement

Latest Nalgonda News