బిందెడు నీళ్ల కోసం బోలెడు కష్టాలు...అభంగపురంలో అల్లాడుతున్న ప్రజలు...!

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం అభంగపురం( Abhangapuram)లో వర్షాకాలంలో మంచినీటి కొరత వేధిస్తోందని, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక బిందెడు నీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలం ఏదైనా ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదని,పలుమార్లు అధికారులకు,పాలకులకు మా పరిస్థితిపై మొరపెట్టుకున్నా స్పందించిన దాఖలాలు లేవని,చేసేదేమీ లేక నిత్యం మా తిప్పలు మేం పడుతున్నామని వాపోతున్నారు.

నీటి కోసంచిన్న పెద్దా అనే తేడా లేకుండా పొలాల్లోని బోరు బావుల వద్దకు వెళ్ళి బిందెలు,క్యాన్లతో బారులు తీరి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని అంటున్నారు.గ్రామపంచాయతీలో ఉన్న మూడు బోర్లలో నీరు ఇంకిపోవడంతో, అప్పుడప్పుడు వస్తున్న మిషన్ భగీరథ ( Mission Bhagiratha )నీళ్లతోగొంతులు తడుస్తున్నాయని, అది కూడా పని వదులుకొని ఇంటిదగ్గర ఎవరో ఒకరు ఉంటేనే దొరికే అవకాశం ఉందని గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో బోర్లు ఉన్న రైతులు కూడా మంచి నీటిని పట్టుకోనివ్వడం లేదని,ఇలాగే కొనసాగితే నీళ్ళు లేక గ్రామం అల్లడిపోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నేడు సాగర్ కు నలుగురు రాష్ట్ర మంత్రులు రాక...ఎడమ కాలువకు నీటి విడుదల...!
Advertisement

Latest Nalgonda News