కలనా లేక నిజామా.. పాకిస్తాన్లో జగన్నాథుడి రథయాత్ర (వీడియో)..!

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం ( Jagannath Temple )భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథుడి రథయాత్రలో పాల్గొంటారు.

 Jagannath Rath Yatra In Pakistan Goes Viral, Jaganatha Yatra, Viral Video, Soc-TeluguStop.com

పాకిస్తాన్లోని వందలాది మంది హిందువులు కూడా జగన్నాథ యాత్రను జరుపుకోవడానికి గుమిగూడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు.

రథయాత్ర సమయంలో జగన్నాథ్, అతని సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలను పూజిస్తారు.ఈ సంబరానికి లక్షల మంది భక్తులు హాజరవుతారు.

ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో, భక్తుల గుంపుగా శ్లోకాలు పాడటం, పువ్వులతో అలంకరించిన రథాన్ని లాగడం కనిపిస్తుంది.పాకిస్తాన్( Pakistan ) హిందువులు చేపట్టిన జగన్నాథ రథయాత్రలో ప్రజలు పాకిస్తాన్ జెండాలను ఎగురవేయడం కూడా గమినించవచ్చు.ముస్లింలు అధికంగా ఉన్న ఈ దేశంలో పాకిస్తాన్ హిందువులు కూడా రథయాత్రను నిర్వహించగలరనే వాస్తవం పట్ల సోషల్ మీడియా నెటిజన్స్ ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆషాఢ చంద్ర మాసం( Ashada Masam )లోని శుక్ల పక్షంలో, పూరి రథ యాత్రను చేపడతారు.ఇది పురాతన, అతిపెద్ద హిందూ పండుగగా పరిగణించబడుతుంది.ఇది ప్రతి సంవత్సరం పూరీలో జరుగుతుంది.

ఈ రథయాత్ర జగన్నాథుడికి అంగరంగా వైభవంగా జరుగుతుంది.రథయాత్ర సమయంలో జగన్నాధుడిని, అతని సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర విగ్రహాలను మూడు భారీ రథాలలో గుండిచా ఆలయానికి తీసుకువెళతారు.

అక్కడ వారు ఒక వారం పాటు ఉండి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు.ఇంకెందుకు ఆలస్యం పాకిస్థాన్ లో జరిగిన శోభనమీయమైన రథ యాత్రకు సంబంధించిన వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించి తరించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube